సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishnan) రోజురోజుకు నెట్టింట   గ్లామరస్ గా కనువిందు చేస్తోంది. కుర్ర భామాలా ముస్తాబవుతూ కుర్రాళ్లను   సైతం తన వెంట తిప్పుకునేలా చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
   

వయస్సు   పెరుగుతున్నా కొద్దీ మరింతగా గ్లామర్ మెరుపులతో అభిమానులు, నెటిజన్లను   అట్రాక్ట్ చేస్తోంది సీనియర్ నటి  రమ్యకృష్ణన్. కుర్ర హీరోయిన్లకు పోటీగా   ఇంటర్నెట్ లో క్రేజీ ఫొటోషూట్లతో దర్శనమిస్తోంది. 
   

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం నటి రమ్యకృష్ణ. వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ సీనియర్ హీరోయిన్ అభిమానులు, ఆడియెన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ భారీ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. మరింత మంది అభిమానులను కూడగట్టుకుంటోంది.

ఇంతటి   క్రేజ్ సంపాదించుకున్న రమ్యకృష్ణకు సోషల్  మీడియాలో మాత్రం కాస్తా ఫ్యాన్   ఫాలోయింగ్ తక్కువగానే ఉంది. దీంతో గతకొద్ది రోజులుగా ఇంటర్నెట్ లో సందడి   చేస్తోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు అదిరిపోయేలా ఫొటోషూట్లు   చేస్తూ వస్తోంది. 
   

తాజాగా   మరిన్ని గ్లామర్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది.   ఈ ఫొటోల్లో వింటేజ్ రమ్యకృష్ణలా అభిమానులకు కనువిందు చేసింది. మెరూన్ శారీ   లో ఘాటు అందాలను ప్రదర్శించింది. కొంగుతో చిలిపి పనులు చేస్తూ, మత్తు   చూపులతో నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది.
   

అప్పటికే   వెండితెరపై ప్రేక్షకులకు గ్లామర్ రుచి ఏంటో చూపించిన ఈ అందెగత్తె.. ఇక   ప్రస్తుతం ఇంటర్నెట్ లోనూ తనదైన శైలిలో అందాలను విందు చేస్తోంది. రమ్యకృష్ణ   గ్లామర్ షోకు నెటిజన్లు  కూడా ఫిదా అవుతున్నారు. ఆమె పోస్ట్ చేస్తున్న   గ్లామర్ ఫొటోలను లైక్ చేస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. 
   

సెకండ్ ఇన్నింగ్ లోనూ రమ్యకృష్ణ అన్ని భాషల్లోని చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. 'బాహుబలి' తర్వాత ప్రతి ప్రాజెక్ట్ లో రమ్యకృష్ణనే ఎంపిక చేస్తున్నారు దర్శకనిర్మాతలు. రీసెంట్ గా లైగర్ (Liger)తో అలరించింది. ఇక టీవీ షోలతోనూ ఆకట్టుకుంటోంది. 'డాన్స్ ఐకన్' (Dance Ikon)కు జడ్జీగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం 'జైలర్'లో నటిస్తోంది.
 
  




.jpg)
 
No comments:
Post a Comment