సమంత సర్జరీ చేయించుకున్నారన్న ఒక వార్త టాలీవుడ్ ని ఊపేస్తోంది. సమంత నటించిన ఒక యాడ్ వీడియో బయటకు రాగా అందులో సమంత ముఖం పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో సర్జరీ వార్తలు నిజమే అంటూ జనం నమ్ముతున్నారు .

Samantha
ఆ
 మధ్య సమంత అమెరికా వెళ్లారు. కొన్నాళ్లు ఆమె సోషల్ మీడియాకు దూరమయ్యారు. 
పబ్లిక్ లో కూడా కనిపించలేదు. సమంత అమెరికా ప్రయాణానికి కారణం ఆరోగ్య 
సమస్యలు అంటూ కథనాలు వెలువడ్డాయి. స్కిన్ సమస్యతో బాధపడుతున్న సమంత చికిత్స
 కోసం అమెరికా వెళ్లారని పుకార్లు వినిపించాయి. 
 

Samantha
అలాగే చిత్రీకరణ దశలో ఉన్న ఓ వెబ్ సిరీస్ కోసం సమంత యుద్ధ విద్యలు 
నేర్చుకుంటున్నారని మరొక కథనం తెరపైకి వచ్చింది. ఐతే మొదటి కథనమే నిజమంటూ 
కొత్త వాదన మొదలైంది. ఓ కమర్షియల్ షూట్ లో సమంత పాల్గొనగా ఆ వీడియో బయటకు 
వచ్చింది. సదరు వీడియోలో సమంత ముఖం చాలా భిన్నంగా ఉంది. కొత్తగా కొంచెం 
కృత్రిమంగా కనిపించింది. 

Samantha
సమంతను చూసిన అభిమానులు షాక్ తిన్నారు. ఆమె ముఖంలో ఈ మార్పుకు కారణం ఏమిటనే
 ఆలోచనలో పడ్డారు. అమెరికా వెళ్లిన సమంత ముఖానికి సర్జరీ చేయించుకున్నారు. 
అందుకే ఆమె ముఖం మారిపోయిందని అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం 
లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 

Samantha
గతంలో
 కూడా సమంత సర్జరీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కెరీర్ బిగినింగ్ లో సమంత ముఖం 
ఇలా ఉండేది కాదు. ఏమాయ చేశావే, దూకుడు, బృందావనం చిత్రాల్లో ఆమె లుక్ కి 
లేటెస్ట్ చిత్రాల్లో లుక్ కి చాలా తేడా ఉంది. సమంత ముక్కుకు సర్జరీ 
చేయించుకున్నారని అప్పుడు ప్రచారమైంది. 
 

Samantha
ఈసారి
 ఆమె ముఖానికి పలు సర్జరీలు చేయించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వరుస 
కథనాలు నేపథ్యంలో సమంత స్పందిస్తారేమో చూడాలి. ఇక సర్జరీలు 
చేయించుకొని ముఖాలు మార్చుకోనే సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది. అతిలోక సుందరి
 శ్రీదేవి సైతం ముక్కుకు సర్జరీ చేయించుకున్నారనే వాదన ఉంది. 
 

కొందరు హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ పరిమాణం, రూపం మార్చుకున్నారు. కాగా 
విడాకుల అనంతరం సమంత నిర్ణయాలు, చర్యలు చాలా బోల్డ్ గా ఉంటున్నాయి. ఇక 
కెరీర్ పరిశీలిస్తే తెలుగులో సమంత యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాల్లో 
నటిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు. 
more details: https://telugu.asianetnews.com/gallery/entertainment/samantha-facing-serious-surgery-allegations-her-looks-seems-different-rkcytf#image1